స్థానిక సంస్థల ఎన్నికల వేళ విశాఖలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

రిపోర్టర్: నరేష్ స్థలం: విశాఖపట్నం

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ కోసం విశాఖ నగరంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు VizagCityPolice వెల్లడించారు. గోపాలపట్నం, న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతి ఇంటిని, షాపులను నిశితంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని పదకొండు వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, ప్రజల భద్రత కోసం తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.