ప్రయాణికుల రద్దీ నియంత్రణకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే
రిపోర్టర్: సునీల్
స్థలం: సికింద్రాబాద్
ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. పండుగ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల హైదరాబాద్, కొల్లాం, చర్లపల్లి, నరసాపూర్ మార్గాలతో పాటు సికింద్రాబాద్, కాకినాడ, జాల్నా, తిరుపతి మార్గాల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని వారు వెల్లడించారు. ప్రయాణికులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.