అగ్రిగోల్డ్ బాధితులకు ఊరటనిస్తూ నిషేధిత జాబితా తొలగింపునకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

అగ్రిగోల్డ్ ప్లాట్ల కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలో నిర్ణయించింది. హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలి విడతలో 35,444 మంది బాధితులకు లబ్ధి చేకూర్చాలని తీర్మానించారు. అలాగే రిజిస్ట్రేషన్లు కాని మరో 6,989 మంది బాధితులకు రెండో విడతలో న్యాయం చేయాలని నిర్ణయించారు. బాండ్ల సేకరణకు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.