మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడిని ఖండించిన కేటీఆర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: వరంగల్

వరంగల్ ఎంజీఎం వద్ద పోలీసుల దాడిలో గాయపడిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను కేటీఆర్ పరామర్శించారు. పోలీసుల అత్యుత్సాహం వల్లే వినయ్ భాస్కర్‌కు గాయాలయ్యాయని ఆరోపించారు. వరంగల్ అజారా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించిన కేటీఆర్, ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.