అంతర్జాతీయ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖను అభినందించిన మంత్రి నారా లోకేశ్
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
అంతర్జాతీయ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ సోమవారం ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారని అధికారులు తెలిపారు. జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్ ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆమె ప్రతిభను మంత్రి లోకేశ్ కొనియాడారు. రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ క్రీడా ప్రయాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి భరోసా ఇచ్చారు.