పెందుర్తిలో ఘనంగా జాతీయ పోషణ్ మాసోత్సవాలు ప్రారంభం

రిపోర్టర్: నరేష్ స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా పెందుర్తి ఐసీడీఎస్ కార్యాలయంలో తొమ్మిదవ జాతీయ పోషణ్ మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పౌష్టికాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక అధికారులు, మహిళలు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.