నాగార్జున వందో చిత్రంలో విలన్గా తమిళ నటుడు అశోక్ సెల్వన్

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వందో సినిమా కింగ్ 100లో తమిళ నటుడు అశోక్ సెల్వన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఆర్.ఎ. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటి టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.