భారీ పతనం దిశగా దేశీయ స్టాక్ మార్కెట్లు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయకుమార్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ఈ నష్టాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సెన్సెక్స్ 650 పాయింట్లు పడిపోగా, నిఫ్టి 22,600 దిగువకు పడిపోయిందని నిపుణులు వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఇదే ఆందోళన కొనసాగే అవకాశం ఉందని వారు తెలిపారు.