రవాణాపల్లి గిరిజన పాఠశాలలో ప్రశాంతంగా ముగిసిన ఎస్ఎంసీ ఎన్నికలు

రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు స్థలం: కొయ్యూరు

కొయ్యూరు మండలంలోని రవాణాపల్లి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంగళవారం ఎస్ఎంసీ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు మృదుభాషిణి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో చేతులెత్తే పద్ధతి ద్వారా ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ప్రక్రియలో కిత్తలోవ గ్రామానికి చెందిన కూడా రమణమ్మ చైర్మన్గా, కూడా కనకమహాలక్ష్మి వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పాఠశాల సిబ్బంది స్పష్టం చేశారు.