టీమిండియాతో చారిత్రాత్మక టీ20 సమరానికి జపాన్ జట్టు ప్రకటన
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
టీమ్ ఇండియాతో సెప్టెంబర్ 22న జరిగే చారిత్రాత్మక టీ20 సమరం కోసం జపాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. కెండల్ కడోవాకి-ఫ్లెమింగ్ సారథ్యంలో ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన స్క్వాడ్‌నే జపాన్ బరిలోకి దించుతోంది. భారత్, జపాన్ ద్వైపాక్షిక సంబంధాల 75 సంవత్సరాల వేడుకల్లో భాగంగా 'స్పోర్ట్ 75' పేరుతో ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు.