నా కుమార్తె మసాబాకు తండ్రి లేకపోవడానికి క్షమాపణ కోరాను: నీనా గుప్తా

రిపోర్టర్: మహేష్ స్థలం: India

ఒంటరి తల్లిగా కుమార్తె మసాబాను పెంచడంలో ఎదురైన సవాళ్లపై ప్రముఖ నటి నీనా గుప్తా స్పందించారు. చిన్నతనంలో తండ్రి ప్రేమ దూరమవ్వడానికి మసాబాకు ఎన్నోసార్లు క్షమాపణ చెప్పానని తెలిపారు. అయితే తన తండ్రి వివియన్ రిచర్డ్స్ గురించి ఎవరి ద్వారానో కాకుండా తన నుంచే నిజం తెలుసుకునేలా చేశానని, అందుకే తనపై ఎలాంటి పగ లేదని స్పష్టం చేశారు.