కర్ణాటకలో మహిళ దారుణ హత్య భర్తతో పాటు మరో వ్యక్తి అదుపులోకి

రిపోర్టర్: గోపి స్థలం: రాయచూరు

కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూర్ సబ్ డివిజన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆర్‌హెచ్ క్యాంప్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల స్నేహ అనే మహిళను దుండగులు తలపై రాయితో కొట్టి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఏడుస్తున్న ఏడాదిన్నర పాపను మృతదేహంపై ఉంచి పరారయ్యారు. గ్రామ శివారు పొలంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి భర్త అమిత్, వివాహేతర సంబంధం ఉన్నట్లు భావిస్తున్న శుభమ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.