'భారత్‌ను సెమీకండక్టర్ హబ్‌గా మారుస్తాం': ప్రధాని నరేంద్ర మోడీ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం ప్రారంభమైన 'సెమీకాన్ ఇండియా-2026' సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఇతర దేశాలు ఈ రంగంలో పురోగతి సాధించేందుకు పదేళ్లు పడితే, భారత్ కేవలం నాలుగేళ్లలోనే కీలక ముందడుగు వేసిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.