రామడుగులో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

సిరికొండ మండలం రామడుగు గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక యువకులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టే కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యువకుల కేరింతలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు కోలాహలంగా మారాయి.