మిథున్ రెడ్డిపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర ఆగ్రహం: వీధి రౌడీ అంటూ మండిపాటు
రిపోర్టర్: సునీల్
స్థలం: తూర్పు గోదావరి
మిథున్ రెడ్డి వ్యవహారశైలిపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ శ్రేణులను ఎస్కార్ట్ వాహనాలతో తొక్కించాలంటూ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించడం దారుణమని, ఆయన ఎంపీ కాదని వీధి రౌడీ అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. వెంటనే ఆయనకు కల్పించిన సెక్యూరిటీని తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రజాస్వామ్య వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు.