అమెరికా హెచ్చరిక: ఇరాన్ సార్వభౌమత్వానికి బహిరంగంగా మద్దతు తెలిపిన చైనా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: బీజింగ్

హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా మరియు ఇరాన్ మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగిన తరుణంలో ఇరాన్ సార్వభౌమత్వానికి చైనా బహిరంగంగా మద్దతు ప్రకటించింది. ఇరాన్ భద్రతాధికారి అలీ బఘేరి కనీతో జరిగిన చర్చల్ లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. యుద్ధాన్ని నివారించాలని కోరుతూనే ఇరాన్ భద్రతను కాపాడుతామని వెల్లడించారు. అమెరికా దళాలు ఇరాన్ క్షిపణి లాంచర్ పై దాడి చేయడంతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయని అధికారులు తెలిపారు.