పాలకొల్లులో దివ్యాంగులకు కోటి పది లక్షలతో సహాయ ఉపకరణాల అందజేత

రిపోర్టర్: వెంకట్ స్థలం: పశ్చిమ గోదావరి

దివ్యాంగులకు రూ.1 కోటి 10 లక్షలతో సహాయ ఉపకరణాలు అందజేశామని నిమ్మల రామానాయుడు - జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే వెల్లడించారు. పాలకొల్లు నియోజకవర్గంలో భగవంతుని స్వరూపులైన దివ్యాంగులకు సెయిల్ సీఎస్ఆర్ నిధులతో సహాయ ఉపకరణాలను ఉచితంగా అందజేసేందుకు ఒక మెగా శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో కలిసి పాల్గొని లబ్ధిదారులకు ఉపకరణాలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.