అమెరికాలో నిర్వహించిన సాట్ పరీక్షలో ప్రవాసాంధ్ర బాలుడి అరుదైన ప్రతిభ
రిపోర్టర్: హరి
స్థలం: జార్జియా
అమెరికాలో నిర్వహించిన స్కూల్ అసెస్మెంట్ టెస్ట్ (సాట్) పరీక్షలో ప్రవాస తెలుగు కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలుడు అశ్రిత్ తాళ్లూరి అద్భుత ప్రతిభ కనబరిచాడని కుటుంబసభ్యులు తెలిపారు. జార్జియా రాష్ట్రం ఫుల్టన్ కౌంటీకి చెందిన అశ్రిత్ ఏకంగా 1600కి 1600 మార్కులు సాధించి అందరినీ అబ్బురపరిచాడు. ఈ పరీక్షలో తాను సాధించిన విజయంపై అశ్రిత్ మాట్లాడుతూ, అమ్మానాన్నలు, ఉపాధ్యాయుల సూచనలతో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నానని, భవిష్యత్తులో న్యూరోసర్జన్ అవుతానని వెల్లడించాడు.