వినాయక మండపాల ఏర్పాటుపై పోలీసుల కఠిన నిబంధనలు
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
పట్టణంలోని వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇచ్చి, మండపం, విగ్రహం, కమిటీ సభ్యుల వివరాలను పోలీస్ పోర్టల్‌లో ఆన్లైన్లో నమోదు చేయాలని బెల్లంపల్లి వన్‌టౌన్ సీఐ కే. శ్రీనివాసరావు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వెంటనే 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.