ప్రేమ పేరుతో యువతి మోసం: బాధితురాలి దీక్షకు అంబేద్కర్ సంఘం సంఘీభావం
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేట మండలంలో ప్రేమ పేరుతో దళిత యువతిని మోసం చేసిన మున్సిపల్ చైర్మన్ కుమారుడిపై అధికారులు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జన్ను నరసయ్య డిమాండ్ చేశారు. బాధితురాలు చేపట్టిన దీక్షకు నాయకులు మద్దతు తెలిపారు.