కొలిక్కిరాని కృష్ణా జలాల పంపకాలు: మరోసారి వాయిదా పడ్డ కేఆర్ఎంబీ భేటీ
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీ ఎలాంటి నిర్ణయం లేకుండానే వాయిదా పడింది. నాగార్జునసాగర్, శ్రీశైలం నీటి పంపిణీపై ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు భిన్న వాదనలు వినిపించారు. అవసరం లేకున్నా విద్యుత్ ఉత్పత్తి ఆపాలని ఏపీ డిమాండ్ చేయగా, ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందని తెలంగాణ ఆరోపించింది. ఎల్ నినో ప్రభావంతో నీటి కేటాయింపులపై స్పష్టత రాక చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.