ఏలూరులో పోలీసుల కోసం వినూత్నంగా 'సాధన' శిక్షణ కార్యక్రమం
రిపోర్టర్: అశోక్
స్థలం: ఏలూరు
ఏలూరు జిల్లాలో పోలీసు సిబ్బంది వృత్తిపరమైన నైపుణ్యాలను పదును పెట్టేందుకు ఎస్పీ కేపీఎస్ కిశోర్ 'సాధన' పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా స్టేషన్లలోనే ప్రతి శుక్రవారం ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. నేరస్థలంలో సాక్ష్యాధారాల సేకరణ, సీపీఆర్ నిర్వహణ, ట్రాన్సిట్ వారెంట్ వంటి కీలక అంశాలపై డీఎస్పీ నుంచి కానిస్టేబుల్ వరకు అందరికీ మెలకువలు నేర్పిస్తున్నారు.