సిద్దిపేటలో వాకర్స్ విద్యార్థులతో ముఖాముఖి: దశాబ్ది ఉత్సవాల్లో హరీష్ రావు

రిపోర్టర్: అశోక్ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కోమటి చెరువు రూబీ నెక్లెస్ రోడ్డులో వాకర్స్ మరియు జెన్-జీ విద్యార్థులతో బీఆర్ఎస్ నాయకుడు తన్నీరు హరీష్ రావు ఉత్సాహంగా ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యువతతో పలు అంశాలపై చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సిద్దిపేట అభివృద్ధి ప్రయాణంపై యువతలో మరింత అవగాహన పెరిగిందని హరీష్ రావు వెల్లడించారు. ఈ ప్రత్యేక సమావేశంలో స్థానిక ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.