కేశవాపురంలో రూ. 30 లక్షలతో భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే దొంతి పచ్చజెండా

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

కేశవాపురం గ్రామంలో మహిళా సంఘాలు, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక బలోపేతం మరియు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.