సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు, స్ట్రాంగ్ కౌంటర్

రిపోర్టర్: నరేష్ స్థలం: కరీంనగర్

కరీంనగర్‌లో జరిగిన జెన్ జీ సదస్సులో కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌తో పెట్టుకుంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందని హెచ్చరించారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని, రాహుల్ గాంధీ ఇచ్చిన ఉద్యోగ హామీలను గాలికొదిలేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మోసం చేసిందని, మంత్రులు, సీఎం కుక్కల్లా కొట్లాడుకుంటున్నారని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు.