రాష్ట్రంలో ఉద్యోగుల పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న నాలుగు కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి నారాయణ తెలిపారు. ఖాళీలను క్రమబద్ధీకరించి కొత్తగా ఎనిమిది వందల పదిహేను జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు పదోన్నతులు కల్పించడంతో పాటు, ఖాళీ అయ్యే పోస్టులను వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలతో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ద్వారా వేల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు.