బాపట్ల జిల్లాలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

రిపోర్టర్: కిరణ్ స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లా చుండూరు మండల పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 430 గ్రాముల గంజాయితో పాటు 9 టాపెంటాడోల్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చుండూరు సీఐ ఆనంద్ వెల్లడించారు. శనివారం ఎస్సై అనిల్ కుమార్ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు నిర్వహించి నిందితులను అరెస్ట్ చేశారు.