తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి పర్యటన: పంట నష్టం అంచనాలకు ఆదేశం

రిపోర్టర్: సునీల్ స్థలం: West Godavari

పశ్చిమ గోదావరి జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించి, భీమవరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారని అధికారులు తెలిపారు. దెబ్బతిన్న పంట నష్టం అంచనాలను తక్షణమే సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. రేపటి సాయంత్రానికి అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని, ప్రజలు ఇబ్బంది పడకుండా నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు తుపాను సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.