హైదరాబాద్ శామీర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డుపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహనానికి పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాచారం ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.