ఆలూరులో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సొసైటీ చైర్మన్

రిపోర్టర్: విజయ్ స్థలం: ఆలూరు

ఆలూరు మండలం కేంద్రంలో మరియు దేగాంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ తాంబూరి శ్రీనివాస్, దేగాం ప్రమోద్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులు ఈ కేంద్రాల ద్వారా మద్దతు ధర పొందాలని, తగిన తేమ శాతం ఉన్న స్వచ్ఛమైన ధాన్యాన్ని మాత్రమే తీసుకురావాలని సూచించారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని రైతులకు వారు విజ్ఞప్తి చేశారు.