మాజీ మంత్రి బుగ్గన వ్యాఖ్యలు హాస్యాస్పదమంటూ టీడీపీ నేతల మండిపాటు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ప్యాపిలి

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక, టీడీపీ మండల అధ్యక్షులు సుదర్శన్ ప్యాపిలిలో ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్సీపీ హయాంలో దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకున్న చరిత్ర ఆ పార్టీదేనని, కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బుగ్గన అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు తీవ్రంగా విమర్శించారు.