ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్ల హోరాహోరీ పోరు
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలంగాణ
ఆసియా క్రీడలలో భాగంగా గురువారం భారత్ అథ్లెట్లు వివిధ విభాగాలలో పతకాల కోసం హోరాహోరీగా తలపడనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్చరీ, షూటింగ్, కుస్తీ వంటి పలు క్రీడాంశాలలో భారత క్రీడాకారులు క్వార్టర్స్, సెమీస్ పోరులో బరిలోకి దిగుతున్నారు. ముఖ్యంగా వాలీబాల్, హాకీ విభాగాలలో దాయాది పాకిస్తాన్తో భారత్ తలపడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలాగే శ్రీలంకతో క్రికెట్ సెమీఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది.