జలమండలి ఎండీ హామీతో ట్యాంకర్ల సమ్మె విరమణ
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్న నిర్వాహకుల సమస్యలు, రేట్ల పెంపు డిమాండ్‌పై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఎండీ ఇచ్చిన హామీ నేపథ్యంలో ప్రతిపాదిత సమ్మె నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు ట్యాంకర్ అసోసియేషన్ అధ్యక్షులు వెల్లడించారు. శనివారం జలమండలి ఎండీని కలిసి తమ సమస్యలను వివరించగా.. తదుపరి బోర్డు సమావేశంలో చర్చించి రేట్ల సవరణకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జీవీజీ నాయుడు, సంపత్ రావు, అక్బర్ హుస్సేన్, ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.