ప్రధాని నరేంద్ర మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ రాహుల్ గాంధీ సవాల్
రిపోర్టర్: రాజేష్
స్థలం: New Delhi
దేశ ప్రధాని నరేంద్ర మోదీతో తాను బహిరంగ చర్చలో పాల్గొనేందుకు సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత Rahul Gandhi సవాల్ విసిరారు. ఈ ప్రతిపాదనను ప్రధాని అంగీకరించేలా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దేశ యువత కూడా ఈ చర్చను కోరుకుంటోందని, దీనిపై బీజేపీ అగ్రనేతలు వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.