చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హంగామా: తీవ్ర ఆరోపణలు చేసిన పులివర్తి సుధారెడ్డి
రిపోర్టర్: రాము
స్థలం: చంద్రగిరి
చంద్రగిరి నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హంగామా సృష్టించడానికి ప్రయత్నించారని ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతోనే తాను స్వయంగా అక్కడ పర్యవేక్షిస్తూ ఎస్కార్ట్ గా తిరుగుతున్నానని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఆరోపణలను వైకాపా వర్గాలు ఖండించాయి.