సత్యనికేతన్ భవన కూల్చివేత: ఐదుగురు ఎంసీడీ అధికారులు సస్పెండ్
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో బాయ్స్ పీజీ భవనం కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ డెల్లీ కఠిన చర్యలు తీసుకుంది. సీఎం ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ సహా ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ ప్రమాదంపై హైకోర్టు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు, నగరంలోని అన్ని పీజీ హాస్టళ్లలో తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేసింది.