ఢిల్లీ హోటల్ లో మంత్రి ఎమ్మెల్యే ఘర్షణ: కాంగ్రెస్ లో కలకలం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
ఢిల్లీలోని ఓ హోటల్ లో డీసీసీ నియామకాల వివాదం నేపథ్యంలో మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారని వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు పీసీసీకి ఫిర్యాదు చేశారని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఈ పరిణామం తీవ్ర కలకలం రేపిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రైతులు కష్టాల్ లో ఉంటే నాయకులు ఇలా కొట్లాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.