మహేంద్ర తనయ వరదలో ప్రాణాలను పణంగా పెట్టి గిరిజనుల సాహసయాత్ర
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మందస
శ్రీకాకుళం జిల్లా మందస మండలం బెల్లిపటియ వద్ద మహేంద్ర తనయ నదికి వరద పోటెత్తింది. భారీ వర్షాలకు కాజ్ వే నీట మునగడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అయినప్పటికీ గిరిజనులు తమ ప్రాణాలను పణంగా పెట్టి అతి ప్రమాదకరంగా వరద దాటుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటువంటి ప్రయాణాలు అత్యంత ప్రమాదకరమని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.