మిగిలిన నిధులతో పంట కాలువలు పూర్తిచేయాలని రైతుల డిమాండ్
రిపోర్టర్: సతీష్
స్థలం: నెల్లూరు
సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరు చేయగా ఇంకా రూ.18 కోట్ల పనులు మిగిలి ఉన్నాయని, త్వరలోనే వాటిని పూర్తిచేయాలని నెల్లూరు జిల్లా రైతులు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో చెరువులపై దృష్టి సారించకపోవడంతో ఆనకట్టలు, పంట కాలువులు దెబ్బతిన్నాయని జలవనరుల శాఖ ఎస్ఈ దేశినాయక్ పేర్కొన్నారు. తుపాన్ల కారణంగా దెబ్బతిన్న చెరువుల మరమ్మతు పనులను వర్షాకాలంలోపు పూర్తిచేయాలని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.