స్థానిక సమరానికి నెల్లూరు కలెక్టరేట్లో 24 గంటల ప్రత్యేక హెల్ప్‌లైన్
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు అర్బన్
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు కలెక్టరేట్లో ప్రత్యేక హెల్ప్‌లైన్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ప్రజల సందేహాలను నివృత్తి చేయడానికి నెంబర్ 0861-2331261 మరియు వాట్సాప్ నెంబర్ 7995576699 సేవలను నిరంతరం వినియోగించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.