చింతకాని మండల ఓబీసీ మోర్చా నూతన అధ్యక్షుడిగా వేముల ఎల్లయ్య ఎంపిక

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం జిల్లా చింతకాని మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా వేముల ఎల్లయ్య నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు సహా ఇతర ప్రముఖులు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లయ్య నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని వారు ఆకాంక్షించారు.