ఏపీ రాజకీయాల్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చర్చ: కీలక మార్పులకు సీఎం చంద్రబాబు సన్నాహాలు

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై తీవ్ర చర్చ సాగుతోందని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లో కీలక మార్పులు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. మంత్రుల పనితీరును అంచనా వేసి కొత్తవారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ మరియు పల్నాడు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు విశ్లేషకులు తెలిపారు.