క్రికెట్ ఆర్థిక వ్యవస్థపై విమర్శలు: వెస్టిండీస్ బోర్డుకు ప్రసార ఆదాయం దక్కట్లేదు

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

ద్వైపాక్షిక క్రికెట్ ప్రసార ఆదాయాన్ని పంచుకునే ప్రస్తుత ఆర్థిక విధానం తమ బోర్డుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని క్రికెట్ వెస్టిండీస్ సీఈఓ క్రిస్ డెహ్రింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్లో జరిగే సిరీస్ల వల్ల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ, కనీస వాటా కూడా తమకు దక్కడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకే దేశం గుత్తాధిపత్యం చెలాయించే ఈ విధానం క్రికెట్ను దెబ్బతీస్తోందని ఆయన మండిపడ్డారు.