భారత్‌లో త్వరలో ఏఐ ప్లస్ పల్స్ 2 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల
రిపోర్టర్: రాము
స్థలం: భారతదేశం
భారతీయ మార్కెట్‌లోకి త్వరలో ఏఐ ప్లస్ పల్స్ 2 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ప్రముఖ ఈకామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రోసైట్ లైవ్‌లోకి వచ్చింది. ఈ ఫోన్ నలుపు, నీలం, గ్రీన్ మరియు పర్పుల్ రంగులలో లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ జాబితా ద్వారా వెల్లడైంది. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా మాడ్యూల్, గ్లోయింగ్ వైట్ లోగోను కలిగి ఉన్న ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీని కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.