అక్షరాస్యత లేమిపై ముఖ్యమంత్రి సిగ్గుపడాలంటూ కవిత తీవ్ర విమర్శ
రిపోర్టర్: రాజేష్
స్థలం: Telangana
ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే అక్షరాస్యత అట్టడుగున ఉండటంపై నాయకురాలు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రే స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి, సొంత జిల్లాలోని గట్టు, కేటిదొడ్డి మండలాల్లో అఫ్ఘనిస్తాన్ తో సమానంగా అక్షరాస్యత ఉండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు.