ఇంటర్మీడియట్ బోర్డు ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు
రిపోర్టర్: గోపి
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్మీడియట్ బోర్డు 78వ పాలకవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ భేటీలో బోర్డు ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తుది నిర్ణయం తీసుకున్నారు. అలాగే పరీక్షల సిబ్బంది భత్యాలను 25 శాతం పెంచడంతో పాటు 1978 నుంచి ఇప్పటివరకు జారీ చేసిన సర్టిఫికెట్లను బ్లాక్‌చైన్ టెక్నాలజీతో డిజిటలైజ్ చేయాలని తీర్మానించారు.