మైసా నుంచి తొలి పాట విడుదల: రష్మిక మందన్న రౌద్ర రూపం

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ మైసా చిత్రం నుంచి మేకర్స్ తొలి పాట ఓ మైసా రేను విడుదల చేశారని సినీ వర్గాలు వెల్లడించాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఈ పవర్ఫుల్ సాంగ్ కు జేక్స్ బిజోయ్ అద్భుతమైన సంగీతం అందించగా, నవంబర్ 27వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.