బెల్లంపల్లిలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు: అలరించిన మహిళల ఆటపాటలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ 34వ వార్డులో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా సాగాయి. స్థానిక కౌన్సిలర్ కొక్కుల రామ్మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ సంప్రదాయ జానపద పాటలు పాడారు. తెలంగాణ సంస్కృతిని ఘనంగా చాటిన ఈ వేడుకల్లో స్థానిక కాలనీవాసులు ఎంతో ఉత్సాహంగా పాలుపంచుకుని సందడి వాతావరణం నెలకొల్పారు.