భరణం మొత్తాన్ని రూ. 50 లక్షలకు తగ్గించిన కర్ణాటక హైకోర్టు
రిపోర్టర్: రమేష్
స్థలం: కర్ణాటక
భార్యకు కింది కోర్టు కేటాయించిన రూ. 2 కోట్ల భరణాన్ని కర్ణాటక హైకోర్టు రూ. 50 లక్షలకు కుదించింది. దంపతుల మధ్య వివాహ బంధం పూర్తిగా దెబ్బతిన్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇద్దరు పిల్లల పోషణ నిమిత్తం ప్రతి నెలా రూ. 50 వేలు చెల్లించాలని భర్తను ఆదేశించింది. వివాదం ముగిసినట్లు పేర్కొంటూ విడాకులను హైకోర్టు సమర్థించింది.