రైతుల కష్టాలకు శాస్త్రీయ పరిష్కారమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో మనస్వినికి మూడో ర్యాంకు
రిపోర్టర్: గోపి
స్థలం: నెల్లూరు
రైతన్నల కష్టాలను దగ్గరగా చూసి వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదగాలని నిర్ణయించుకున్న జి. మనస్విని జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించి దిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో ప్రవేశం పొందారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లికి చెందిన ఆమె కరోనా సమయంలో తల్లిని కోల్పోయినా ఆత్మస్థైర్యంతో చదివి ఈ ఘనత సాధించారు. అన్నం పెట్టే రైతులకు తన పరిశోధనల ద్వారా మేలు చేయడమే ధ్యేయమని మనస్విని స్పష్టం చేశారు.